కాటేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

కలం, యాదగిరిగుట్ట: పత్తి రైతులకు కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (MLA Beerla Ilaiah) సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి (Katepally) గ్రామంలోని శ్రీ గాయత్రి పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన పత్తిని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. రైతులకు సౌకర్యవంతంగా పత్తి విక్రయించే అవకాశం కల్పించాలని, కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా సాగాలని, రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని పేర్కొన్నారు. రైతులకు అందుబాటులో ఉండేలా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>