కలం, జనగామ: కొడవటూరు (Koduvatoor) గ్రామానికి చెందిన మినలపురం సిద్ధయ్య (50) శుక్రవారం వ్యవసాయ పొలం వద్ద అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఏడు నెలల కిందట కూడా ఆయనపై దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతికి అప్పటి ఘటనే కారణమా.. లేకపోతే మరేమైనా ఉందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ దేవేందర్, ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

