కలం, మహబూబ్నగర్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ఆగిపోయిన పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్లే పాలమూరు జిల్లాలో రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని హన్వాడ, మాదారం, కొమిరెడ్డిపల్లి, మునిమోక్షం గ్రామంలో ఎండిన పంట, పొలాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మునిమోక్షం విద్యుత్ సబ్స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చేసిన పనులు కొన్ని మిగిలిపోయాయని, వాటిని పూర్తి చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. అందుకే ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతన్నలు అల్లకల్లోలం అవుతున్నారని చెప్పారు. దీనికంతటికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అంటూ దుయ్యబట్టారు. ప్రస్తుత కరెంటు కోతల మూలంగా కాలువలు తడుస్తున్నాయి తప్ప మడుల్లోకి నీరు రావడం లేదన్నారు. వరి పంట కోసం ఎకరానికి 25 నుంచి 30 వేల వరకు అప్పులు చేసినా,పంట చేతికి రాకపోవడం తో ఆర్థికంగా రైతాంగం కృంగిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయమే జీవనాధారంగా భావించే పాలమూరు రైతాంగం పై ప్రకృతి కన్నీరు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుతూ మళ్లీ వలసలు వెళ్ళేందుకు పాలమూరు ప్రజలు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. పంటలు పండించేందుకు రసాయనిక ఎరువులు కోసం వేలు ఖర్చు పెట్టారని ఆయన పంట దిగుబడి రాకపోవడంతో అప్పులపాలు అయ్యారని, రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గ్రామాల్లోని పశువులకు తాగేందుకు నీరు సైతం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉన్న కొంత పంటనేనా కాపాడుకునేందుకు కరెంటును నిరంతరం సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనుమాన మండల పార్టీ అధ్యక్షులు కర్ణాకర్ గౌడ్, మాజీ ఎంపీపీ బాలరాజ్, పిఎసిఎస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాసులు, మునిమోక్షం సర్పంచ్ రామేశ్వరి, కిష్టంపల్లి సర్పంచ్ వెంకటయ్య, సీనియర్ నాయకులు చిన్నయ్య, అనంతరెడ్డి, బసిరెడ్డి,, జంబులయ్య, నాగన్న ,యాదయ్య, మల్కయ్య పెంటయ్య సురేష్ వెంకన్న ,మాధవులు, రామలింగం, బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

