ఏపీలో ముగిసిన నామినేషన్ల గడువు

కలం, వెబ్ డెస్క్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Body Elections) భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. 28 జిల్లాల్లోని 659 జడ్పీటీసీ స్థానాలకు 2,805 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వైసీపీ నుంచి అత్యధికంగా 1,092 నామినేషన్లు వచ్చాయి. టీడీపీ తరఫున 1,055 మంది, జనసేన నుంచి 178, బీజేపీ నుంచి 111 మంది నామినేషన్లు వేశారు.

9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 32,095 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 15,017 మంది, వైసీపీ నుంచి 12,419 మంది, జనసేన నుంచి 2,073, బీజేపీ నుంచి 562 నామినేషన్లు వచ్చాయి. సాయంత్రం 5 గంటల్లోగా వచ్చిన వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. అంతేగాకుండా.. వివిధ జిల్లాల్లో నామినేషన్లు వేసేలా ఎస్పీలు అభ్యర్థులకు అవసరమైన భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>