క్వార్టర్స్‌కు సింధు.. అష్మితా సంచలనం!

క‌లం, స్పోర్ట్స్: ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్‌ పీవీ సింధు (PV Sindhu) దూసుకెళ్తోంది. చైనీస్‌ తైపీకి చెందిన చియు పిన్‌-చియాన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సింధు 21-13, 21-14 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి గేమ్‌ను 21-13తో గెలుచుకుంది. రెండో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. విరామ సమయానికి 11-2తో ఆధిక్యంలో నిలిచింది. ప్రత్యర్థి పుంజుకునేందుకు ప్రయత్నించినా సింధు విజయాన్ని అందుకుంది.

సెమీఫైనల్లో సింధు ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వార్దానీ లేదా జపాన్‌ క్రీడాకారిణి హినా అకేచిలో ఒకరితో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు భారత యువ షట్లర్‌ అష్మితా చలిహా పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరాతో జరిగిన మ్యాచ్‌లో అష్మితా 10-21, 21-17, 16-21 తేడాతో ఓడిపోయింది. అంతకుముందు అష్మితా సంచలనం సృష్టించింది.

ప్రపంచ మూడో ర్యాంకర్‌ అకానే యమగుచిని 21-19, 21-18 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, అదే జోరును తర్వాతి మ్యాచ్‌లో కొనసాగించలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్‌ శెట్టికి కూడా నిరాశ ఎదురైంది. జపాన్‌ ఆటగాడు కొడాయ్‌ నరావోకాతో మ్యాచ్‌లో గాయంతో మధ్యలోనే వైదొలిగాడు. తొలి గేమ్‌ను 17-21తో కోల్పోయిన ఆయుష్‌.. రెండో గేమ్‌లో 6-11తో వెనుకబడ్డ సమయంలో మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే సాత్విక్‌సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, త్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్‌ జోడీలు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి. దీంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భారత ఆశలన్నీ ఇప్పుడు సింధు ప్రదర్శనపైనే నిలిచాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>