‘జవహర్ ఎత్తిపోతల’ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

కలం, మధిర రూరల్: ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు గ్రామంలో జవహర్ ఎత్తిపోతల పథకం (Jawahar Irrigation Project) పనులను కాంగ్రెస్ (Congress) పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు. భట్టి కృషితో రూ.630.30 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మితమవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని వ్యవసాయ భూములకు సాగునీటి సదుపాయం మెరుగుపడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

రైతుల కష్టాలను గుర్తించి, వ్యవసాయానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో భట్టి విక్రమార్క చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగానికి అండగా నిలుస్తాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సమస్యలు తగ్గి, వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పులిబండ్ల చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూరం శెట్టి కిషోర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ సిద్దిపోగు ప్రసాద్, కౌన్సిలర్ యన్నం కోటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు తన్నీరు రామకృష్ణ, లక్ష్మారెడ్డి, ఎక్కిటాల కృష్ణారావు, ఓబుల్ లక్ష్మారెడ్డి, బండి వెంకటేశ్వర్లు, గూడెల్లి వెంకటేశ్వర్లు, దశ్రీ కిరణ్, సక్రు, బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>