తుమ్మిడిహట్టి.. ‘మహా’ సర్కార్‌తో చర్చలపై సీఎం వ్యూహాత్మక అడుగులు

కలం, వెబ్ డెస్క్: తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీ అంశంపై త్వరలోనే మహారాష్ట్ర సర్కార్‌తో చర్చలకు సిద్ధం కావాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ పనుల పురోగతిపై సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహిచారు. హైదరాబాద్ బోధి పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, రాజ్య సభ సభ్యులు ఎంపీ వేం నరేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ (Tummidihatti Barrage), డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిపారు.

152 మీటర్ల ఎత్తున బ్యారేజీ..

ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఈనెల 23 తర్వాత చర్చలకు పిలుస్తానని సూచన ప్రాయంగా అంగీకరించినట్లు సీఎం తెలిపారు. బ్యారేజీ నిర్మాణాన్ని అధికారులు సీఎం, మంత్రులకు వివరించారు. 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని తీసుకునే వీలుంటుందనే అంశాన్ని చర్చించారు. మహారాష్ట్ర పరిధిలో ముంపుకు గురయ్యే అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా అటవీ, గిరిజన వెనుకబడ్డ ప్రాంతమైన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు బ్యారేజీ ఎత్తు ఉండాలని.. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఇందుకు మహారాష్ట్రను ఒప్పించేందుకు అవసరమైన అన్ని నివేదికలు సిద్దంగా ఉంచాలని చెప్పారు.

డిండి ప్రాజెక్టుకు నీళ్లు..

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీ, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని ఏదుల వరకు అదనంగా తెచ్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు అవసరమైన పంప్ హౌజులు, పంపులు, సిస్టమ్ వెంటనే చేపట్టాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>