నిర్మల్‌లో రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

కలం, నిర్మల్: నిర్మల్ పట్టణంలో ఈ నెల 25, 26 తేదీల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. పట్టణానికి నీటిని అందించే జీఆర్పీఈ ప్రధాన పైపులైన్‌తో పాటు ఎయిర్ వాల్వ్‌లకు మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు (Water Supply Shutdown) మున్సిపల్ కమిషనర్ రవిబాబు (Municipal Commissioner Ravi Babu) శుక్రవారం వెల్లడించారు. పైపులైన్ మరమ్మతుల కారణంగా ఆదివారం, సోమవారం ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని తెలిపారు. పట్టణ ప్రజలు ఈ విషయాన్ని ముందుగానే గమనించి, అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. మరమ్మతుల పనులకు సహకరించాలని కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>