స్వీట్స్ కొంటున్నారా.. ఇది చెక్ చేసుకోండి!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ నగరంలోని పలు చోట్ల స్వీట్ల షాపులపై టీజీ సేఫ్ (TG SAFE) ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. క్యూర్ పరిధిలో 12 అధికార బృందాలు 17 స్వీట్ల షాపుల్లో తనిఖీలు చేపట్టగా.. ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గడువు ముగిసిన స్వీట్లనే విక్రయిస్తున్నారని తేలింది. పురుగులు పట్టి, ఫంగస్ ఉన్న స్వీట్లను సైతం అమ్మేస్తున్నారు. స్వీట్లు తయారు చేసే గదులు కూడా పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.

దీంతో పలు చోట్ల స్వీట్లను షాపులే ముందే చెత్తబుట్టల్లో పడేశారు. నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించిన వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్‌కు సస్పెన్షన్ నోటీసులు జారీ చేశారు. శ్రీజ, వాసిరెడ్డి, ప్రమోద్ రెడ్డి, శుభం హోం ఫుడ్స్, సుదర్శన్ రెడ్డి, అభిరుచి స్వగృహ ఫుడ్స్ షాపులకు నోటీసులు జారీ జారీ చేశారు. చాలా దుకాణాలు FSSAI లైసెన్స్ లేకుండానే నడుపుతున్నట్లు చూసి షాకయ్యారు.

అన్ని గమనించాకే..

స్వీట్స్ కొనుగోలు చేసేందుకు కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. గడువు ముగిసినా కూడా కొత్త లేబుల్స్ అంటించి విక్రయిస్తుంటారని హెచ్చరించారు. ఏమాత్రం వాసన వచ్చినట్లు అనిపించినా కొనుగోలు చేయకపోవడమే బెటర్ అన్నారు. అంతేగాకుండా.. నిబంధనలు పాటించనట్లు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>