డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదు: ఎన్‌హెచ్‌ఎం జేఏసీ

కలం, వనపర్తి: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె (NHM Employees Strike) శుక్రవారంతో 11వ రోజుకు చేరుకుంది. వనపర్తి (Wanaparthy) జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మె దీక్షా శిబిరాన్ని సీపీఐ జిల్లా నాయకుడు జబ్బర్‌ సందర్శించి ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్‌ వేతనాల చెల్లింపు, వేతనాల పెంపు, ప్రసూతి సెలవులు తదితర ఆరు డిమాండ్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పూర్తిస్థాయిలో పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేరేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని, అవసరమైతే మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>