గడువులోగా పుష్కరాల పనులు పూర్తి చేయాలి: హనుమంతరావు

కలం, బాసర: గడువులోగా గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) పనులను పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు (Endowments Commissioner Hanumantha Rao) అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి బాసరలో గోదావరి నది పుష్కరాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి పుష్కర ఘాట్లను, తదితర పుష్కరాల నిర్మాణ పనుల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వేలాది మంది పుణ్యస్నానాలకు తరలివస్తారని, భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాల పనులన్నింటినీ గడువులోగా పూర్తి చేయాలన్నారు. పనులు నాణ్యవంతంగా చేపట్టాలని వివరించారు. సంబంధిత శాఖల అధికారులు అంతా ఎప్పటికప్పుడు పుష్కరాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉండాలని పేర్కొన్నారు.

అవసరమైన మేరకు పార్కింగ్ సదుపాయం కల్పించాలని చెప్పారు. పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు తమకు అందజేస్తూ ఉండాలని తెలిపారు. ఈ పరిశీలనలో ఇన్ఛార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ సుభాష్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, ఉమ్మడి జిల్లా సూపరిండెంట్ రంగు రవి కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>