కోహ్లీ, కుంబ్లే మాట తప్పారు: అమిత్ మిశ్రా

కలం, స్పోర్ట్స్: టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) తన అంతర్జాతీయ కెరీర్ ముగింపుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ఆయన వెల్లడించారు. ఆ మ్యాచ్‌లో గాయపడటంతోనే తన కెరీర్ మలుపు తిరిగినట్లు తెలిపారు. గాయంతో జట్టును వీడుతున్న సమయంలో నాటి కోచ్ అనిల్ కుంబ్లే తనకు అండగా నిలిచారని మిశ్రా గుర్తుచేశారు. పూర్తిగా కోలుకున్నాక తిరిగి జట్టులోకి వస్తావని కుంబ్లే భరోసా ఇచ్చినట్లు చెప్పారు. అలాగే, ఆ తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ కూడా తనకు ఇదే విధంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అయితే, తాను పూర్తిగా కోలుకున్నాక కోహ్లీని సంప్రదించినప్పుడు పరిస్థితి మారిపోయిందని మిశ్రా ఆరోపించారు. వారం లేదా పది రోజుల్లో స్పందిస్తానని చెప్పిన కోహ్లీ, ఆ తర్వాత తన ఫోన్ కాల్స్‌కు, మెసేజ్‌లకు ఎలాంటి బదులు ఇవ్వలేదని పేర్కొన్నారు. తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీస స్పందన రాలేదని తెలిపారు. మిశ్రా ఇంకా మాట్లాడుతూ.. తమకంటే తీవ్రమైన గాయాలపాలైన ఇతర ఆటగాళ్లు కోలుకోగానే తిరిగి జట్టులోకి వచ్చారని గుర్తుచేశారు. కానీ, తన విషయంలో మాత్రం ఆ నిబంధన పాటించలేదని అన్నారు. ఎవరైనా మనల్ని దూరం పెట్టాలని చూసినప్పుడు మనం ఏమీ చేయలేమని పేర్కొంటూ తన వ్యాఖ్యలను ముగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>