గాయపడిన నరేష్‌కు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పరామర్శ

కలం, జగిత్యాల:  జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నలువాల నరేష్ (Naresh) గాయపడటంతో, ఆయన ప్రస్తుతం జగిత్యాల పట్టణంలోని కేవీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి (Former Minister Jeevan Reddy) ఆసుపత్రికి వెళ్లి నరేష్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా నరేష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

చికిత్సలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నరేష్ కుటుంబానికి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన జీవన్‌రెడ్డి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, నరేష్ గౌడ్, సర్పంచ్ స్వామిరెడ్డి, మహేష్, శ్రీరాముల గంగాధర్, కొక్కుల గంగాధర్, కాటిపల్లి రాజశేఖర్‌రెడ్డి, వంశీ, దరి, చంద్రయ్య, రాజశేఖర్, గణేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>