పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు వద్దు.. అధికారులకు చైర్మన్ సూచన!

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పత్తి కొనుగోళ్లు (Cotton Procurement), జిన్నింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్, మార్కెట్ కమిటీ సెక్రటరీ, పత్తి కొనుగోలుదారులు, రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ మాట్లాడుతూ.. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

పత్తి కొనుగోళ్ల (Cotton Procurement) ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగాలని, రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా చూడాలని, కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పనిచేస్తుందని చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ తెలిపారు. పత్తి కొనుగోళ్లు, జిన్నింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ, పత్తి కొనుగోలుదారులు, రైతులు పాల్గొన్నారు.

Also Read : సీజేపీకి అన్నామలై మద్దతు? : క్లారిటీ ఇదే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>