కలం, వెబ్ డెస్క్ : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల విషయంలో కేంద్రాన్ని విమర్శిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (Annamalai) స్పష్టత నిచ్చారు. సీజేపీకి తాను ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. సీజేపీ అనుసరిస్తున్న నిరసన మార్గాలు, వారి శైలితో తమకు విభేదాలు ఉన్నాయన్నారు. సీజేపీ, తమ సంస్థ ఆశయాలు, రాజకీయ ఎజెండాలు పూర్తిగా వేర్వేరని తెలిపారు. అయితే, ప్రజాస్వామ్యంలో ఏ ప్రశ్నలైనా లేవనెత్తేందుకు, నిరసన తెలిపేందుకు ప్రతి పౌరుడికి, సంస్థకు ప్రాథమిక హక్కు ఉంటుందని పేర్కొన్నారు. డీఎంకే , ఇతర రాజకీయ పక్షాల మాదిరిగానే సీజేపీకి కూడా తమ నిరసనను వ్యక్తం చేసే హక్కు ఉందన్నదే తన వ్యాఖ్యల అంతరార్థమని చెప్పారు.
అదే సమయంలో ఢిల్లీ పోలీసుల ద్వారా సీజేపీ నిరసనకారులపై సాగిన ముందస్తు అరెస్టులు, సుదీర్ఘ అదుపు చర్యలను అన్నామలై (Annamalai) ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ నిరసనకారులను అణచివేయడం సరికాదని, అది వారిని మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఏదైనా విషయంలో తప్పు లేదా అన్యాయం జరిగిందని అనిపిస్తే ప్రధాని మోదీ(PM Modi)ని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తాను వెనుకాడనని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులను అరెస్ట్ చేయడంపైన మాత్రమే తాను స్పందించానని, ఆ పార్టీకి తన మద్దతు ఉంది? అని జరుగుతున్న ప్రచారాంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
Also Read : సరిహద్దులో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయి : ఐటీబీపీ డీజీ శత్రుజీత్ కపూర్
Follow Us On: X(Twitter)

