కలం, కరీంనగర్: నిజాం కాలంలో పెత్తందార్ల అన్యాయాలకు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది పేదలకు అండగా నిలిచిన నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న అని కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) పేర్కొన్నారు. గురువారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో పండుగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, డీఆర్వో స్వామి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఇతర అధికారులు, ముదిరాజ్ సంఘం నాయకులు సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని దోపిడీ చేస్తున్న దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.

