ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేద్దాం: జగన్

కలం, వెబ్ డెస్క్: చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా పోలీసులను వాడుకుని రాష్ట్రంలో హింస చోటుచేసుకునేలా వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఆరోపించారు. రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బరిలో నిలిచేందుకు అభ్యర్థులు నామినేషన్ వేయడం రసాభాసగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య అల్లర్లు తీవ్ర స్థాయికి చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పలువురు వైసీపీ నేతలను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో స్థానిక ఎన్నికల్లో ముందుకు సాగడంపై తమ పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ లో  మీటింగ్ ఏర్పాటు చేసి లోకల్ బాడీ ఎన్నికల్లో అక్రమాలు, రాష్ట్రంలో హింసపై సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ (YS Jagan) మాట్లాడుతూ..  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ తప్పుల మీద తప్పులు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని.. దీనిపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు.  ప్రభుత్వాన్ని నడుపుతున్నవారే ఇలా అల్లర్లు చెలరేగేలా చేయడం ఎక్కడా చూసి ఉండమని అన్నారు. హింసాత్మక ఘటనలపై ఆధారాలు సేకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంత వరకైనా పోరాటం చేద్దామని వైసీపీ నేతలకు సూచించారు.

కాగా, ఏపీలో స్థానిక ఎన్నికల దృష్ట్యా అల్లర్లు చెలరేగడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేసింది. అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రిలీజ్ ను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది.

Also Read : జ‌న‌సేన‌కు టీడీపీతోనే ముప్పు.. బొలిశెట్టి కీల‌క వ్యాఖ్య‌లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>