కలం, బాసర : బాసర రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT Basara)లో దసరా సెలవులను పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అకాడమిక్ విభాగం బుధవారం ప్రకటించింది. పీయూసీ-1 నుంచి ఈ-4 వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్యాంపస్‌లో విద్యా, వసతి కార్యకలాపాలు సజావుగా నిర్వహించేందుకు దసరా సెలవుల అనంతరం తరగతుల పునఃప్రారంభాన్ని మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. తరగతులు తిరిగి ప్రారంభమయ్యే కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు సవరించిన షెడ్యూల్‌కు సంబంధించి విశ్వవిద్యాలయం జారీ చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూస్తూనే విద్యార్థుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

