కలం, ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి (Indervelli Gambling) మండల కేంద్రంలోని పాడుబడిన మిట్టల్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేసినట్టు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టె తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఆదిలాబాద్ టాస్క్ఫోర్స్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2,24,100 నగదు, 14 మొబైల్ ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.పేకాట నిర్వహణకు స్థలం ఇచ్చిన జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమాని గోరే సేటుపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేరుగా పర్యవేక్షించే వాట్సాప్ నంబర్ 8712659973కు వివరాలు పంపించాలని సూచించారు.

