జాన్సెనే వరల్డ్ నంబర్ వన్.. డేల్ స్టెయిన్ ప్రశంసలు!

కలం, స్పోర్ట్స్​ : బ్యాట్‌తో పరుగుల వరద.. బంతితో వికెట్ల వేట! ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్న మార్కో జాన్సెన్‌ (Marco Jansen)పై దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే జాన్సెన్ అత్యుత్తమ క్రికెటర్ అని కొనియాడాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో జాన్సెన్ చేసిన ప్రదర్శన ఈ ప్రశంసలకు కారణమైంది. తొలుత బ్యాటింగ్‌లో జాన్సెన్ 85 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా 110 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఏడో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బవుమా 179 పరుగులతో రాణించగా, సైమన్ హార్మర్ 82 పరుగులు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 425/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్న జాన్సెన్.. బౌలింగ్‌లోనూ చెలరేగాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 33 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్ విధించింది. జాన్సెన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ముగ్ధుడైన డేల్ స్టెయిన్.. ప్రపంచంలోనే ప్రస్తుతం అతడే అత్యుత్తమ క్రికెటర్ అని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ ప్రదర్శనతో జాన్సెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రేసులో నిలిచాడు. బవుమా కూడా తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఈ అవార్డు పోటీలో ఉన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>