రేణుక ఎల్లమ్మ ఆలయ తరలింపుకై అఖిలపక్ష సమావేశం

కలం, వలిగొండ: వలిగొండ (Voligonda) పట్టణ కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం తరలింపుకై బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఆలయం తరలింపు తప్పనిసరి అని అందరి అభిప్రాయం మేరకు తరలించడం జరుగుతుందని తెలిపారు. అందుకు అఖిలపక్షం నాయకులు ఆమోదం తెలపడంతో అనంతరం నూతన ఆలయ నిర్మాణం స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>