కలం, వనపర్తి: ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన వనపర్తి (Wanaparthy)–గోపాల్‌పేట ప్రధాన రహదారిపై బాలనగర్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాలనగర్‌కు చెందిన మల్లెల మన్యం (76) మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఎం. కృష్ణ ఇంటి ఎదుట రోడ్డు డివైడర్ దాటుతుండగా.. వనపర్తి నుంచి గోపాల్‌పేట వైపు వెళ్తున్న స్ప్లెండర్ ప్లస్ బైక్ (టీఎస్06ఈఎస్6132) ఆయనను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మన్యం తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆటోలో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

