బంగ్లాదేశ్ టూ హైదరాబాద్: పట్టుబడ్డ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా!

కలం, వెబ్​ డెస్క్ : విజయవాడ (Vijayawada)లో భారీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టయింది. బంగ్లాదేశ్ నుంచి కోల్ కతా మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్న అక్రమ బంగారాన్ని, విదేశీ కరెన్సీని డీఆర్ఐ అధికారులు విజయవాడ శివార్లలో విజయవంతంగా పట్టుకున్నారు. సుమారు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే మూడు కేజీలకు పైగా విదేశీ బంగారం, అమెరిక డాలర్లు, యూరోలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్ వివరాల్లోకి వెళితే, నగర శివార్లలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు ఒక స్కార్పియో వాహనంపై అనుమానం కలిగింది. ఆ వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా, రహస్య అరలో దాచిన విదేశీ కరెన్సీ బయటపడింది. విచారణలో ఆ నగదు మొత్తం బంగారాన్ని విక్రయించినందువల్ల వచ్చిన సొమ్ము అని తేలింది.

అదే సమయంలో హైదరాబాద్ వెళ్తున్న మరో బస్సులో ముగ్గురు క్యారియర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టోల్ ప్లాజా వద్ద ఆ బస్సును ఆపి తనిఖీలు చేపట్టగా, నిందితులు తమ నడుముకు కట్టుకున్న ప్రత్యేక పౌచ్ లలో మూడు బంగారు బిస్కెట్లను దాచిపెట్టినట్లు వెల్లడైంది. ఈ సోదాల్లో మొత్తం మూడు కిలోల పైచిలుకు విదేశీ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ నెట్ వర్క్ కు సంబంధించి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>