నిర్మల్‌లో చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అషు ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైర్మన్ కప్ క్రికెట్ (Chairman Cup Cricket) టోర్నమెంట్‌ను మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

క్రీడల్లో పాల్గొనడం వల్ల యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు. యువత చదువుతోపాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, కత్తి నరేందర్, లక్కాకుల హరీష్, నాయకులు ధర్మాజీగారి శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, డీసీసీ జనరల్ సెక్రటరీ జూనైద్ మెమన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>