కలం, నిర్మల్: బైంసా(Bhainsa) పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ గడపలే బాబు మృతి చెందడం పోలీస్ శాఖకు తీరని లోటు అని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki) అన్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బాబు మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఆయన స్వగ్రామమైన తానూర్ మండలం బెంబేరా గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) హజరై బాబు పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో పోలీస్ శాఖ కుటుంబానికి అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్, ముధోల్ సీఐ రవీందర్ నాయక్, తానూర్ ఎస్సై షేక్ జుబేర్ ఖాన్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దండేకర్ సాయికుమార్, పోలీస్ సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొని గడపలే బాబుకు నివాళులర్పించారు.
Also Read : ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం..లోయలో పడిన ఆర్టీసీ బస్సు!
Follow Us On : WhatsApp

