దసరా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

కలం, ఖానాపూర్ : ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక ప్రజలతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలన్నారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని, ఐక్యతా భావాన్ని నింపాలని ఎమ్మెల్యే (Vedma Bojju Patel) ఆకాంక్షించారు. అనంతరం ఎల్‌నినో ప్రభావంతో సంభవించే వాతావరణ మార్పులు, వాటి వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ఖానాపూర్ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>