కలం, వెబ్ డెస్క్ : ఇటలీలో నిరసనల సందర్భంగా హింసాత్మక ఘటనలను అదుపు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హింసాత్మక ప్రదర్శనల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త భద్రతా నిబంధనలకు (Italy Protest Law) ఆమోదం తెలిపింది. హింసాత్మక చర్యల్లో పాల్గొన్ వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 20 వేల యూరోల వరకు జరిమానా విధించే నిబంధనలను తీసుకొచ్చింది.
అంతేకాకుండా, పిల్లలు విధ్వంసం, దోపిడీలకు పాల్పడితే వారి తల్లిదండ్రులపైనే భారం మోపేందుకు కూడా ఇటలీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రమాదకరంగా భావించే టీనేజర్లను నిర్బంధించే విషయంలో పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ చర్యలను (Italy Protest Law) సమర్థిస్తూ.. “విధ్వంసం, దొంగతనం నిరసన కాదు.. అవి నేరాలు” అని స్పష్టం చేశారు.
ఉత్తర ఇటలీలో జరిగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో మిలన్ ఈ ఏడాది చివరి పోలీసులతో పాటు 500 మంది సైనికులను మోహరించాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు, 2027 ఎన్నికలకు ముందు జీవన వ్యయం, ఇంధన ధరలు పెరుగుతుండడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్నాయి.

