పారా గేమ్స్‌లో భారత్‌ జోరు.. ఒకే రోజు ఐదు స్వర్ణాలు!

కలం, స్పోర్ట్స్ : ఆసియా పారా గేమ్స్‌లో(Asian Para Games 2026) భారత అథ్లెట్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. తొలి రోజు నాలుగు స్వర్ణాలు సాధించిన భారత ప్లేయర్లు.. రెండో రోజు ఐదు స్వర్ణాలతో అదరగొట్టారు. రెండో రోజు అథ్లెటిక్స్‌లో ఐదు స్వర్ణ పతకాలు సాధించారు. నిషాద్ కుమార్ రెండు రోజుల్లోనే రెండో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. హైజంప్‌ టీ47 విభాగంలో 2.04 మీటర్లు ఎగిరి గేమ్స్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సోమవారం లాంగ్‌జంప్‌లోనూ స్వర్ణం గెలిచాడు. ఒకే ఎడిషన్‌లో రెండు స్వర్ణాలు సాధించిన మూడో భారత అథ్లెట్‌గా నిలిచాడు. తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజి మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో స్వర్ణం గెలిచింది. 56.36 సెకన్లలో రేసును పూర్తి చేసి గేమ్స్‌ రికార్డు నెలకొల్పింది. మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్‌ 24.80 సెకన్లతో స్వర్ణం సాధించింది.

డిస్కస్‌ త్రోలో ప్రవీణ్‌ సూర్మా ఆసియా రికార్డుతో స్వర్ణం గెలవగా, దేవేందర్‌ కుమార్‌ కూడా తన విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. అథ్లెటిక్స్‌తో పాటు షూటింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, పారా టేబుల్‌ టెన్నిస్‌లోనూ భారత్‌కు పతకాలు వచ్చాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో మనీష్‌ నర్వాల్‌ రజతం గెలిచాడు. ఈ ఫలితంతో 2028 లాస్‌ ఏంజెలెస్‌ పారాలింపిక్స్‌కు భారత్‌కు కోటా స్థానం లభించింది. మహిళల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో శ్రిష్టి అరోరా కాంస్యం సాధించింది. పారా పవర్‌లిఫ్టింగ్‌లో అశోక్‌ కుమార్‌ మాలిక్‌ రజతం గెలిచాడు.

స్విమ్మింగ్‌లో హిమాన్షు నందల్‌, నిరంజన్‌ ముకుందన్‌ కాంస్య పతకాలు సాధించారు. పారా టేబుల్‌ టెన్నిస్‌లో భారత ఆటగాళ్లు ఐదు కాంస్యాలు గెలిచారు. స్టాండింగ్‌ విభాగంలో సాహనా, ప్రాచీ పాండే పతకాలు సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు ఆర్చరీ, బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు మరిన్ని పతకాలు ఖాయమయ్యాయి. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో షీతల్‌ దేవి ఫైనల్‌కు చేరింది. స్వాతి చౌదరి కూడా తన విభాగంలో ఫైనల్‌ చేరి కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో ప్రమోద్‌ భగత్‌, కుమార్‌ నితేశ్‌ సింగిల్స్‌ సెమీఫైనల్స్‌కు చేరారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ భారత జోడీలు ముందడుగు వేశాయి. రెండో రోజు ముగిసే సమయానికి భారత్‌ తొమ్మిది స్వర్ణాలు, 11 రజతాలు, 15 కాంస్యాలతో మొత్తం 35 పతకాలు సాధించి పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>