హుస్నాబాద్ అభివృద్ధే లక్ష్యం: మంత్రి పొన్నం

కలం, హుస్నాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విజయదశమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)  అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ (Husnabad) ఎల్లమ్మ చెరువు వద్ద నిర్వహించిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొని రావణ దహనం కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి ఆశీస్సులు, సహకారంతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, ఈ ప్రాంత ప్రజలకు మరింత గౌరవం తీసుకువచ్చే విధంగా పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. శాతవాహన యూనివర్సిటీల ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యావకాశాలను విస్తరించి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి, భవిష్యత్తులో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి హుస్నాబాద్ ప్రాంతంలో వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. 250 పడకల ఆసుపత్రి, పీజీ వైద్య కళాశాల వంటి సదుపాయాల అభివృద్ధితో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని రహదారులు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ ప్రజలకు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్న ఎల్లమ్మ చెరువును మరింత సుందరీకరించి, అర్బన్ ఫారెస్ట్ పార్క్ అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేసి, ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గానికి మరిన్ని అవకాశాలు తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

విజయదశమి స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, యువజన సంఘాలు, ప్రజలందరూ సమష్టిగా ముందుకు వచ్చి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>