నిర్మల్‌లో పండుగ సాయన్న జయంతి పోస్టర్ ఆవిష్కరణ.. కీలక పిలుపు

కలం, నిర్మల్ : ఈ నెల 22న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న పండుగ సాయన్న ముదిరాజ్‌ (Panduga Sayanna) 174వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ముదిరాజ్‌ సమన్వయ సంఘాల కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో జయంతి వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. బహుజనుల హక్కుల కోసం పోరాడిన అమరజీవి పండుగ సాయన్న ముదిరాజ్‌ ఆశయాలు స్ఫూర్తితో ముదిరాజ్‌ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ముదిరాజులను బీసీ – డీ నుంచి బీసీ – ఏలోకి మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు జీఓ నంబర్‌ 15ను యథావిధిగా అమలు చేయాలని కోరారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు సలేంద్ర శివయ్య, దర్శనం దేవేందర్‌, పాతర్ల హరీష్‌, బర్మ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>