సరస్వతి శిశు మందిర్‌ను సందర్శించిన నిరంజన్ రెడ్డి

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలను రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ఏలేటి నిరంజన్ రెడ్డి (MP Niranjan Reddy) సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతులు, అభివృద్ధి పనుల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలి శిశు మందిర్ పాఠశాల పునఃప్రారంభం కావడంతో పాటు తిరిగి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ప్రారంభం కావడం పూర్వ విద్యార్థిగా తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

శ్రీ సరస్వతి శిశు మందిర్ సీబీఎస్సీ పాఠశాల కోసం దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్ గ్రామం వద్ద నాలుగు ఎకరాల స్థలాన్ని నిరంజన్ రెడ్డి అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, పాఠశాల అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, కార్యదర్శి ఆయన్నగారి శ్రీకాంత్, సహాయ కార్యదర్శి అయిట్ల ప్రవీణ్, ఉపాధ్యక్షులు అదుముల్ల, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>