కలం, మునుగోడు: మర్రిగూడ మండలం కుదబాక్షపల్లి (Kudabakhshapalli) గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. పొట్ట అశోక్ ముదిరాజ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంఘ ఉపాధ్యక్షుడిగా పొలగోని యాదగిరి ముదిరాజ్, కార్యదర్శిగా కూర శ్రీనివాస్ ముదిరాజ్, ట్రెజరర్‌గా పొలగోని పవన్ ముదిరాజ్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి, సామాజిక వర్గం ఐక్యతకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ముదిరాజ్ సామాజిక వర్గం అభివృద్ధి, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

