లాభాల వేటలో ప్రాణాలు తీస్తున్న హోటళ్లు… పట్టించుకోని అధికారులు!

క‌లం, మెద‌క్ బ్యూరో: ఆహార పదార్థాల ఆకర్షణీయమైన రంగులు, రుచులు చూసి లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే జాగ్రత్త! ఆ రంగు, రుచుల వెనుక తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఆవహించి ఉన్నాయి. పరిశుభ్రతకు ఏమాత్రం చోటులేని వాతావరణంలో నాసిరకం, కల్తీ, నిల్వ ఉంచిన పదార్థాలతో తయారవుతున్న ఆహారం ప్రజారోగ్యంతో చెలగాటమాడుతోంది. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని (Medak Food Poisoning)ప‌లు ప్రాంతాల్లో హోట‌ల్స్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హైవేల మీద దాబాల నిర్వాహకులు లాభ‌లు కోసం క‌ల్తీ స‌రుకులతో శుచి ,శుభ్ర‌త‌ను ప‌ట్టించుకోకుండా చేస్తున్న వంట‌లు ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు వ‌స్తున్నాయి. ఇటీవల నర్సాపూర్ లో కల్తీ ఫుడ్ తిని యువ‌కుడు చనిపోవ‌డ‌మే కాకుండా , పలువురు ఫుడ్ పాయిజనింగ్‌తో తీవ్ర అస్వస్థతకు గురికావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇష్టారాజ్యంగా పెరిగిన పుడ్ స్టాల్స్

మారుతున్న ఆహ‌ర అల‌వాట్ల‌తో పాటు అర్ధిక ప‌రిస్ధితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలు ,ప‌ట్ట‌ణాలు అనే తేడాలేకుండా ఎక్క‌డ‌చూసి , ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బిర్యానీ సెంట‌ర్లు , దాబాలు ,హోట‌ల్స్ ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఏర్పాటు అయ్యాయి . అయితే, చాలా చోట్ల ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తున్న ప్రదేశాలు, వంట సామాగ్రి, పరిసరాల పరిశుభ్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వంటగదుల్లో అపరిశుభ్రత, ఈగలు, దోమలు, పురుగుల బెడద వంటి సమస్యలు ఆహార భద్రతకు పెద్ద ముప్పుగా మారాయి. వంట గ‌ది నుండి మొద‌లు హోట‌ల్ హ‌ల్,దాని ప‌రిస‌ర ప్రాంతాలన్ని ప‌రిశుభ్రంగా ఉండాలి . వంట చేసే స్థలంలో శుభ్రత, పదార్థాల నిల్వ విధానం, వంట చేసే వారి వ్యక్తిగత పరిశుభ్రతను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంది. కేవలం ఆహారం రుచిగా ఉంటే సరిపోదు, అది ఆరోగ్యానికి హాని కలిగించకుండా శుచి, శుభ్ర‌త‌ను పాటించాలి. ఆహార విక్ర‌య కేంద్రాలు ప్రభుత్వం నుండి తీసుకోవాల్సిన వుడ్ సెఫ్టీ లైసెన్స్ , లేబ‌ర్ , శానిటేష‌న్ కు సంబంధించిన స‌ర్టిఫికేట్లు తీసుకోవడం లేదు . ప్రజా ఆరోగ్యంపై ఏమాత్రం లెక్క చేయ‌కుండా పరిశుభ్రత లేని వాతావరణంలో ఆహారాన్ని విక్రయిస్తూ జ‌నాల‌ను రోగాల‌ ముప్పులోకి నెడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

రోగాల‌కు నిలయాలుగా ఆహ‌ర కేంద్రాలు

గ‌త‌వారం నర్సాపూర్ పట్టణంలోని ‘వన్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఆహారం తీసుకున్న 15 మందికి వుడ్ పాయిజ‌న్ కావ‌డంతో వాంతులు ,విరోచ‌నాల‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో సాయిరాం అనే 19 యేళ్ల‌ యువకుడు పుడ్ పాయిజ‌న్ తో మృతి చెందాడు. ఇంకా ప‌లుగురు హ‌స్ప‌ట‌ల్స్ చికిత్స పొందుతున్నారు. పుడ్ బిజినెస్ లో పోటి పెర‌గ‌టంతో లాభార్జనే ధ్యేయంగా నాసిరకం ముడిసరుకులు వినియోగిస్తున్నారు. ఫ్రిజ్‌లలో రోజులకు తరబడి నిల్వ చేసిన మాంసాన్ని, పదేపదే మరిగించిన నూనెలను వంటల్లో ఉపయోగించ‌డం చాల కేంద్రాల్లో సాద‌ర‌ణంగా మారింది . క‌నీస నాణ్యత ప్ర‌మాణాలు పాటించ‌కుండా ప్ర‌తిస్ధాయిలోను త‌క్కువ ధ‌ర ఉన్న ముడిస‌రుకులు, నూనెల‌ను వాడుతున్నారు. మార్కెట్ లో పోటికి తట్టుకొవ‌డానికి 99,100 బిర్యానీలు అంటూ రోడ్లుమీద పెట్టిమ‌రి విక్ర‌యిస్తున్నారు. దాబాలు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో చికెన్, ఇతర మాంసాహార పదార్థాలను రోజులకు తరబడి ఎలా నిల్వ చేస్తున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయని మాంసం, ఎక్కువ సేపు బయట ఉంచిన ఆహార పదార్థాలు త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఒకసారి వంటకు వినియోగించిన నూనెను పదేపదే ఉపయోగించడం వల్ల ఆహార నాణ్యత దెబ్బతిని క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు దారితీసే ప్రమాదం ఉంది. నాణ్యత లేని ముడి పదార్థాలు, సరిగా నిల్వ చేయని ఆహార పదార్థాలు , కలుషిత నీరుతో వండిన వంట‌లను తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

తూతుమంత్రంగా త‌నీఖీలు చేస్తున్న పుడ్ సెఫ్టీ అధికారులు

గ్రామాలు , పట్టణాలు అనే తేడాలేకండా వెలసిన ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, మిర్చి దుకాణాలు, దాబాలు, టిఫిన్, బిర్యానీ సెంట‌ర్ల ఇతర ఆహార విక్రయ కేంద్రాల గురించి సంబంధిత ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది. అహ‌ర విక్ర‌య కేంద్రాలు ప్రభుత్వం నుండి తీసుకోవ‌ల్సిన వుడ్ సెఫ్టీ లైసెన్స్ , లేబ‌ర్ , శానిటేష‌న్ కు సంబంధించిన స‌ర్టిఫికేట్లు తీసుకొవ‌డంలేదు .ఇష్టారాజ్యంగా వెలిసిన వుడ్ స్టాల్స్ యొక్క‌ నాణ్య‌త‌, శుభ్ర‌త విష‌యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుడ్ సేఫ్టీ అధికారులు , ప్ర‌భుత్వ‌ అధికారులు సమన్వయంతో క్ర‌మ‌త‌ప్ప‌కుండా ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, మిర్చి దుకాణాలు, దాబాలు, టిఫిన్,బిర్యానీ సెంట‌ర్ల ఇతర ఆహార విక్రయ కేంద్రాలను విస్తృత తనిఖీ చేయాలని, నాణ్యతను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

పుడ్ సెఫ్టీ అధికారులు స‌రిగా తనిఖీలు చేయ‌క‌పోవ‌డం, ఒక‌వేళ చేసినా చర్యలు సక్రమంగా తీసుకొక‌పొవ‌డంతో హొట‌ల్స్ నిర్వ‌హ‌కులు నాణ్య‌త , శుభ్ర‌త‌ను గాల్లో వ‌దిలేసి ప్ర‌జ‌ల అరోగ్యాల‌తో చెల‌గాటం అడుతున్నారు. ప్రజలు అనారోగ్యానికి గురైన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే అప్రమత్తమై ప్రమాదాలను నివారించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. కేవలం నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టకుండా, నిరంతర పర్యవేక్షణ చేపట్టి ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలి. నాణ్య‌త‌, క‌ల్తీ అహ‌రంకు సంబంధించి సామ‌న్య ప్ర‌జ‌ల నుండి వ‌చ్చే ఫిర్యాదుల‌ను తీసుకొవ‌డానికి వ్య‌వ‌స్ధ‌ను ఏర్పాటు చేయ‌వ‌లసిన అవ‌స‌రం ఉంది . చాల సంద‌ర్భాల్లో ఎవ‌రికి ఫిర్యాదు చేయాలో అర్ధం కాక ప్ర‌జ‌లు మౌనంగా ఉంటున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ ప్ర‌భుత్వ భాద్య‌త కనుగ పుడ్ సేప్టీ ,ఇత‌ర స్ధానిక ప్ర‌భుత్వ‌ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. ప్ర‌జ‌ల‌కు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూసుకోవాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>