ప్రమాదరహిత జిల్లాగా యాదాద్రి: కలెక్టర్ అనురాగ్

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరిని ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి (Anurag Jayanthi) తెలిపారు. ఇందులో భాగంగా భువనగిరి పట్టణంలో జీరో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ – జీరో ఫేటల్ డిస్ట్రిక్ట్ (ZRTA) కార్యక్రమంలో భాగంగా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు.

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు..

ఎల్లమ్మ ఆలయం సమీపంలోని క్రాస్‌రోడ్, బీబీనగర్ క్రాస్‌రోడ్, దీప్తి హోటల్ ఎదురుగా ఉన్న ప్రాంతంతో పాటు జాతీయ రహదారిపై పలు బ్లాక్ స్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి గుర్తించారు. ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు భద్రతా చర్యలను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ సంగం, బీబీనగర్ ఎస్ఐ రమేష్, ఎస్ఐ అనిల్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>