కలం, లక్ష్మణచందా : లక్ష్మణచందా మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రజా వీరుడు పండుగ సాయన్న (Panduga Sayanna) విగ్రహ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సమాజంలో పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అలాంటి గొప్ప మహనీయుడి విగ్రహాన్ని నిర్మల్ జిల్లాలోనే తొలిసారిగా లక్ష్మణచందా మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణచందా సర్పంచ్ ఓస కవిత రాజు, ఉప సర్పంచ్ వర్ష రవి, మల్లాపూర్ సర్పంచ్ బిమేష్, మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, నాయకులు యాటకారి సాయన్న, పాతర్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఎండిన పంటలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
Follow Us On : WhatsApp

