కలం, సినిమా : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘RAPO23’ నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh) కీలకమైన పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, ఆయనకు స్వాగతం పలికింది. దసరా పండుగ సందర్భంగా ఈ ప్రకటన చేసిన చిత్ర యూనిట్.. సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను కూడా ప్రారంభించింది. రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.

