కలం, వెబ్ డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హవా కొనసాగుతుంది. సోమవారం మండల పరిషత్ (MPTC Elections), జిల్లా పరిషత్ ఎన్నికలకు (ZPTC Elections) సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 23 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం 24వ రోజున నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు.
ఎన్నికల నియమావళిని అనుసరించి సరైన విధంగా సమర్పించని అభ్యర్థి నామినేషన్ ను అధికారులు తిరస్కరించనున్నారు. అయితే నామినేషన్ ఉపసంహరణకు 27వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 3న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. కాగా, నేటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఆసక్తి నెలకొంది.
ముగిసిన ‘మున్సిపల్’ గడువు..
ఇప్పటికే పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నెల 14న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల16 నుంచి 18 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరణ పూర్తయింది. 19న అంటే సోమవారం నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. 21వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. 28న ఎన్నికల పోలింగ్, అవసరమైన కేంద్రాల్లో 29న రీపోలింగ్ నిర్వహిస్తారు. చివరగా 30 తారీఖున అధికారులు కౌంటింగ్ నిర్వహించి రిజల్ట్స్ ప్రకటించనున్నారు.
Also Read : అహోబిలంలో భారీ అగ్ని ప్రమాదం..!
Follow Us On: X(Twitter)

