అహోబిలంలో భారీ అగ్ని ప్రమాదం..!

కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం (Ahobilam Fire Accident) జరిగింది. అర్ధరాత్రి బీగాల ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న 6 దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

దిగువ అహోబిలం(Ahobilam)లోని ఆలయం ఎదురుగా ఉన్న దుకాణాల్లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో బొమ్మల దుకాణాలు, హోటళ్లోని వస్తువులు పూర్తి కాలిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల వద్ద ఉన్న గ్యాస్ సిలిండర్లను పోలీసులు తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు.

Also Read : ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. నేడు నోటిఫికేషన్ విడుదల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>