కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal Kusti) జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి మల్లయోధులు తరలివచ్చి పోటీల్లో ఉత్సాహంగా తలపడ్డారు. హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలను తిలకించేందుకు భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు బాలికలు పాల్గొని విజేతలుగా నిలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ప్రతిభను పలువురు అభినందించారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటచారి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వై. సాయన్న, శెనిగారపు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

