మళ్ళీ మైదానంలోకి రిజ్వాన్ ఎంట్రీ

క‌లం, స్పోర్ట్స్‌: పాకిస్థాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌ (Mohammad Rizwan)కు బోర్డు నుంచి బిగ్ రిలీఫ్ లభించింది. ఆన్‌లైన్ బెట్టింగ్, డ్రెస్సింగ్ రూమ్ సమాచారం లీక్ చేశారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న అతనికి డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు పీసీబీ అనుమతించింది. ఈ మేరకు ప్రెసిడెంట్స్ కప్ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్‌లో అక్టోబర్ 19 నుంచి ఆడేందుకు అనుమతి ఇస్తూ సందేశం వచ్చినట్లు ఎస్‌ఎన్‌జీపీఎల్ హెడ్ కోచ్ మహమ్మద్ హఫీజ్ ధృవీకరించారు. ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత రిజ్వాన్‌తో పాటు ఇమామ్ ఉల్ హక్‌లను స్వదేశానికి రప్పించి మ్యాచ్‌లకు దూరంగా ఉంచారు.

నేషనల్ సైబర్ క్రైమ్ సెల్ (ఎన్‌సిసిఏ) వీరిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో భాగంగా ఇద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. అక్టోబర్ 10న లాహోర్‌లో రిజ్వాన్ ఆఖరిసారిగా విచారణకు హాజరయ్యాడు. అనంతరం పరిస్థితులు సర్దుమణగడంతో ఈ విచారణ త్వరలోనే ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లార్డ్స్ టెస్ట్ తర్వాత ఏ రకమైన క్రికెట్ ఆడని రిజ్వాన్‌కు ఈ నిర్ణయంతో ఊరట లభించినట్లయింది. ఈ కేసు తుది నివేదిక ఆధారంగా పీసీబీ తదుపరి చర్యలు తీసుకోనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>