కలం, నిర్మల్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆదివారం అష్టమి సందర్భంగా మహిషాసుర దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti) మహిషాసుర దహనం చేశారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులు నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యం రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, నాయకులు జమాల్, ఇర్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

