సంగుపేటలో సీలింగ్ భూమి కబ్జా యత్నం.. అడ్డుకున్న దళితులు!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట శివారులోని ప్రభుత్వ సీలింగ్ భూమిని చదును చేస్తున్న పనులను స్థానిక గ్రామస్థులు, దళితలు అడ్డుకున్నారు. గ్రామంలోని సర్వే నంబర్ 307 లో ఉన్న సుమారు 7 ఎకరాల సీలింగ్ భూమిని జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి, కబ్జా (Land Encroachment ) చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రామస్థులు తీవ్రస్థాయిలో ఆరోపించారు.

సంగుపేట గ్రామానికి చెందిన పది మంది దళిత కుటుంబాలు ఈ సీలింగ్ భూమిలోనే వ్యవసాయ సాగు చేసుకుంటూ తమ జీవనోపాధిని పొందుతున్నామని బాధితులు తెలిపారు. ఉపాధికి ఆధారమైన ఈ భూమిని కబ్జా చేయడానికి యత్నించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూ ఆక్రమణ వ్యవహారంపై బాధితులు జోగిపేట రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సీలింగ్ భూమి కబ్జా కాకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అక్రమార్కుల నుండి భూమిని కాపాడి, భూమి లేని నిరుపేద దళితులకే ఈ భూమిని కేటాయించి ఆదుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>