మెదక్ RTC రీజియన్‌లో TWU ఘన విజయం

కలం, మెదక్: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో మెదక్ రీజియన్‌లో (ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్టీసీ డిపోలలో ) (Medak RTC Elections ) కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కు గుర్తింపు లభించింది. తెలంగాణ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (TWU) రీజియన్ లో మెజార్టీ యూనియన్ గా నిలిచి గుర్తింపును దక్కించుకుంది.

మెదక్ రీజియన్‌లో మొత్తం 1808 ఓట్లు పోలవ్వగా తెలంగాణ వర్కర్స్ యూనియన్ కు 888 ఓట్లు లభించాయి. దీనితో ఉమ్మడి జిల్లాలో గల తొమ్మిది డిపోలలో మెజారిటీ యూనియన్ గా గుర్తింపు పొందడం వల్ల మెదక్ డిపోలో ఆర్టీసీ కార్మికుల సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజు, మెదక్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మెదక్ డిపో ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మందుగుల గంగాధర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడుతుందన్నారు. ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం తమ ధ్యేయమని, గౌరవ ముఖ్యమంత్రి పాలనలో కార్మికులకు ఎటువంటి అన్యాయం జరగదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కర్స్ యూనియన్ రీజనల్ ఇన్చార్జ్ ఎం. ఆర్. కె. రావు, రాష్ట్ర కార్యదర్శి, శాఖయ్య, పి. ఎస్. రెడ్డి, సుబ్బారావు, మెదక్ డిపో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>