బాసరకు మహా సంకల్ప పాదయాత్ర

కలం, భైంసా: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భైంసా మున్సిపల్ ఛైర్మన్ తూమోల్ల దత్తాత్రి (Tumolla Dattatri), కౌన్సిలర్లు ఆదివారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి మహా సంకల్ప పాదయాత్ర చేపట్టారు. భైంసా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. సుమారు 35 కిలోమీటర్ల పాటు భక్తిశ్రద్ధలతో పాదయాత్ర సాగించి బాసర చేరుకున్న అనంతరం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా దత్తాత్రి మాట్లాడుతూ.. భైంసా పట్టణంలో రాక్షస పాలన అంతమైందని, బాసర పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రానున్న పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. రైతులకు సమృద్ధిగా పంటలు పండి, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని మహా సంకల్పంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>