వైసీపీ నేతలపై దాడి.. SECకి జగన్ ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్: వైసీపీ నేతలు నామినేషన్లు వేయడానికి వెళ్తుంటే టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్లు వేయలేని పరిస్థితి ఉంటే.. ఎన్నికల కమిషనర్ పరువే పోతోందని స్పష్టం చేశారు. ప్రతి నామినేషన్ కేంద్రంతో పాటు రేపు పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రంలో కూడా కచ్చితంగా సీసీ కెమెరాలు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. వాటిని స్టోర్ చేయాలని సూచించారు.

తమకు చంద్రబాబు ప్రభుత్వంపై ఏమాత్రం నమ్మకం లేదని.. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదన్నారు. నామినేషన్ల ప్రక్రియనే ఇంత దారుణంగా ఉంటే రేపు రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థమవుతోందన్నారు. కమిషనర్ తాము చెప్పిన వాటికి తల ఊపారని.. ఆయన పారదర్శకంగా ఉంటే తాము చెప్పినవి అమలవుతాయని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో వైసీపీ అభ్యర్థులకు ఎస్కార్ట్ ఇచ్చేలా చూడాలని కోరారు.

టీడీపీ కార్యకర్తగా మారిన డీఐజీ..

డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ కార్యకర్తగా మారిపోయారని జగన్ ఆరోపించారు. ఆయన ఆదేశాలతో వివిధ జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు టీడీపీకి సపోర్ట్ చేస్తూ.. వైసీపీని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి జరిగితే, ఎంపీనే టీడీపీ నేతలపై దాడి చేశాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథున్ రెడ్డి కారులో మద్యం బాటిళ్లు పెట్టారన్నారు. పోలీస్ అధికారులు ముఠాలా ఏర్పడి.. వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. గతంలో కూడా నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తి ఎన్నికల కమిషనర్‌గా ఉంటూ కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా పనిచేశాడని గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>