కలం, వలిగొండ : వలిగొండ (Valigonda) మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల శ్రీ హరి హర త్రిశక్తి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏనిమిదవ రోజు అమ్మవార్లు కాళరాత్రిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం, లలితపారాయణం, లక్షపుష్పార్చన, చతుశష్టిపూజ, పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భిన్నూరి గోపాలకృష్ణ, కమలాకరాశర్మ, అనురాధమనోహరి, శ్రీనివాసగుప్తా, పంతులు ప్రమోద్ కుమార్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

