రుద్రంగిలో ఎలుగుబంటి బీభత్సం.. బతుకమ్మ పూలకు వెళ్లిన వ్యక్తిపై దాడి..!

కలం, ​రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా రుద్రంగి (Rudrangi) మండల కేంద్రంలో ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా పూల కోసం అడవి ప్రాంతానికి వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగుబంటి తీవ్రంగా దాడి (Bear Attack) చేసింది. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వంకాయల లక్ష్మణ్ ఉదయం స్థానిక నాగారం చెరువు అటవీ ప్రాంతంలోని గుట్టల వైపు బతుకమ్మ పూల (తంగేడు పూలు) కోసం వెళ్లారు.

అదే సమయంలో అక్కడ సంచరిస్తున్న ఎలుగుబంటి ఒక్కసారిగా లక్ష్మణ్‌పైకి దూసుకొచ్చి దాడికి పాల్పడింది. ​ఈ అనూహ్య దాడిలో లక్ష్మణ్ తలపై, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంటి సంచారాన్ని అరికట్టాలని, బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>