పాలనలో డిజిటల్ విప్లవం: ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, వెబ్​ డెస్క్​ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ సంజయ్ జాజు పర్యవేక్షణలో తెలంగాణ ప్రభుత్వం పాలనారంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్ (Telangana e-HRMS) విధానాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, పరిపాలనలో మరింత పారదర్శకత, వేగం తీసుకురావడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.

ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఐఎఫ్ఎంఐఎస్ (IFMIS) తో పూర్తిస్థాయిలో అనుసంధానిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం జీవో నంబర్లు 138, 139, 141 లను విడుదల చేసింది. దేశంలోనే అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే సమగ్ర డిజిటల్ హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్ (Telangana e-HRMS) పరిధిలోకి తీసుకొస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోంది. ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా సర్వీసు వివరాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం మరింత సులభతరం కానున్నాయి.

Also Read : పండుగలు వస్తే బాదుడేనా.. ఆర్టీసీ చార్జీలపై హరీశ్ ఫైర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>