బతుకమ్మ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy), జిల్లా అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మాట్లాడుతూ.. పూలను పూజించే గొప్ప సంస్కృతి మనదని అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ బతుకమ్మ పండుగను భక్తితో జరుపుకోవాలని అన్నారు. జిల్లా ప్రజలందరికీ దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>