సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల కీలక ప్రతిపాదనలు

కలం, ఖమ్మం బ్యూరో: రైతుల భూములను పరిరక్షించడంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) సీఎం రేవంత్‌రెడ్డికి కీలక ప్రతిపాదనలు అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్​లో ముఖ్యమంత్రికి వేర్వేరుగా లేఖలు అందించారు. సీతారామ ప్రాజెక్టుతోపాటు ఆయిల్‌పామ్ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సమగ్ర పరిష్కారాలను సూచించినట్లు శనివారం వెల్లడించారు.

​సీతారామ ఎత్తిపోతల పథకంలో కాలువలకు బదులుగా సాధ్యమైన చోట పైపుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల 9,767 ఎకరాల భూమి ఆదా కావడంతో పాటు, భూసేకరణ, నిర్మాణ వ్యయంలో సుమారు రూ. 2,148.74 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానా ఆదా కానుందని వివరించారు. అలాగే ఆయిల్‌పామ్ తోటల్లో ఎత్తుగా పెరిగే చెట్ల వల్ల విద్యుత్తు లైన్లు ట్రిప్ అవ్వడం, ప్రమాదాలు జరగకుండా 11 కేవీ లైన్లకు కవర్డ్ కండక్టర్లు ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయి ఉమ్మడి విధానం తేవాలని కోరారు.

​ఇక దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలతో సుమారు ఒక టీఎంసీ నీటిని తాత్కాలికంగా నిల్వ చేయడం ద్వారా మూడు జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చాలని కోరారు. సీఎం వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు. వీటితోపాటు ఖమ్మంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాలకు ఆమోదం తెలపాలని, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరారు. డిసెంబరు 9న కల్లూరిగూడెం ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ, వెలుగుమట్ల హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>